Tuesday, January 17, 2012

క్రీస్తూ..ఓషో...మిర్దాదో మరేదో!

అసలైన బైబిల్ మిర్దాద్ పుస్తకమా? మిర్దాద్, బైబిల్ ఒకటేనా? స్వార్ధంకోసం దేవుడ్నే మోసం చేసారా? అని ఈమధ్య ఒకాయన ఒక పోస్ట్ రాసారు. http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_16.html
అసలేం చెప్పలనుకుంటున్నారో అర్ధం కానప్పటికీ తెలుగు బ్లాగు ప్రపంచంలో క్రైస్తవ్యం మీద ఉన్న అవగహనా రాహిత్యం, అసహననికి ఇది ఒక నిదర్శనం. ఆయానకి నాకున్న కొంచెం జ్ఝ్నానంతో ఇచ్చిన సమాధానం ఇక్కడ...

క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి మీకున్న ఆసక్తి అభినందనీయం. మీరు ప్రస్త్తవించిన మిర్దాద్ పుస్తకం గురించి నేనీమీ చెప్పలేనుగానీ మీరు క్రైస్తవం గురించి మొదటి పేరాలో చేసిన ఆ వ్యాఖ్యలకి సోర్స్ ఏంటో తెలుసుకోవొచ్చా? క్రీస్తు బౌధ్ధం ప్రచారం చేసాడా? దఃఖానికి కోరికలు కారణం అని క్రైస్తవ్యం చెబుతుందా? జీవితాన్ని కోరుకున్న రీతిలో బతకండి అని చెబుతుందా? ఇది మీ సొంత కవిత్వమా లేక శ్రుత పాండిత్యమా? మీరెప్పుడైనా బైబిల్ చదివారా కనీసం?లేక సంచలనం కోసం ఇలా కథనాలు వండి వారుస్తుంటారా?

ఓషొ గురించి ఆయన క్రీస్తు గురించి అన్న మాటలగురించి నేనూ కొంచం విన్నాను. నాకు ఓషో మాటలకన్న ఆయన ఫొటోలు బాగా నచ్చుతాయి. మంచి కాస్ట్యూం డిజైనర్, మంచి ఫొటోగ్రాఫెర్ మరొక మంచి పోస్ స్టైలిస్ట్ కలిసి ఒక భగవంతుడిలా ఆయన్ని బాగనే పెయింట్ చేసారు.

ఒక యోగి ఆత్మ కథ చదివారా? దాంట్లో జీసస్ ని ఒక క్రియా యోగిగా, ఒక enlightened master గా ప్రస్తావించారు. ఈ ఓషో కూడా ఒక పుస్తకంలో జీసస్ సిలువ మీద మరణించలేదని, ఒక యోగా technique ఉపయోగించి బయటపడి తిరిగి మన కాష్మీర్ వచ్చి, పెళ్ళి చెసుకుని ఇక్కడే చనిపొయాడని, ఆయన సమాధి అక్కడే పెహల్గావ్ అనే ఊర్లో ఉందనీ రాసారు. పెహల్గావ్ అన్న పేరు ఆ ఊరికి రావడానికి కారణం కూదా జీసస్సేనట. ఎందుకూ అంటే ఆయన ఒక గొర్రెల కాపరి కదా? హ హా! అదండీ జీసస్ గురించి ఓషో గారికి ఉన్న అవగాహన. "నేను నిజమైన గొర్రెల కాపరిని, నిజమైన గొర్రెల కాపరి తన మంద కోసం తన ప్రాణం పెడతాడు" అని జీసస్ తన మరణం గురించి ప్రవచనాత్మకంగా చెప్పిన మాటల్ని inspiration గా తీసుకుని కొంతమంది ఆయన గొర్రెల కాపరిగా paintings వేస్తే...ఆయనేదో నిజంగా గొర్రెలని మేపుకొనేవాడని మన ఓషో decide అయిపొయాడు. ఇక ఏం మాటాడమంటారు మన "భగవాన్" గురించి? ఇలా జీసస్ గురించి పరస్పర విరుధ్ధమైన రెండు కథనాలు రాయడంలో ఓషోకున్న confusion ఏంటో? (see http://www.messagefrommasters.com/Hidden-Mysteries/Jesus-lived-in-india.htm)
also, read pages 166,203,258,302,362,363,400,471 etc in "auto biography of a Yogi".

క్రీస్తుని విమర్శించే వాళ్ళు ముందు మీ stand ఏంటో గా తేల్చుకోండి. ఓ పక్కనుంచి జీసస్ కి ఒచ్చిన జ్ఞానమంతా మనమిచ్చెందే అనీ ఆయన బాల్యంలో భారతదేశం వచ్చి యోగ, ధ్యానం నేర్చుకెళ్ళాడనీ అంటారు. కానీ క్రైస్తవ్యం మాత్రం పాశ్చాత్య దేశాలనుంచీ ఒచ్చిందంటారు. కొంతమంది ఆయన ఒక క్రియా యోగి అనీ, జ్ఞానం పొందీన బుధ్ధుడు అనీ అంటారు. గౌతమ బుధ్ధ, క్రిష్ణుల స్థాయిలోని గురువు అంటారు. అంతలోనే ఆయన్ని అనుసరించేవారు మాత్రం డబ్బుకు, ప్రలోభాలకి అమ్ముడు పోయారు అంటారు.

బైబిల్లో ఒకసారి(మత్తయి 22:42)ఆయనే అక్కడున్న (యూదా)మతవాదులని అడిగినట్టుగా మిమ్మల్నీ అడగాలనుకుంటున్నా..

క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది?

యూదులు అనుకున్నట్టుగా ఆయన తనని తాను దేవుని కుమారుడిగా పిల్చుకునే ఒక దురహంకారా? ఇస్లాంలో రాయబడినట్టుగా పరిశుధ్ధత్మ కలిగిన ఒక దేవదూతా? క్రైస్తవులు నమ్ముతున్నట్టుగా మనుషుని రూపంలో పుట్టిన సర్వ స్రుష్టికర్త అయిన దేవుడా? పరమ హంస యోగానంద లాంటి వారు నమ్మినట్టుగా, బుధ్ధుడు, క్రుష్ణుడు వంటి వారి శ్రేణిలో ఒకడైన enlightened masterఆ? లేక మన ఓషో గారు తన స్థాయికి తగ్గట్టుగా సెలవిచ్చిన ...

అప్పుడు రాయండి ఏమన్న ఉపయోగపడేవి. మేమూ పాలుపంచుకుంటాం! అంతేగానీ ఇలా మీరు confuse అయ్యి మమ్మల్నిconfuse చేయకండి.

5 comments:

Krishna said...

అయితగాని జనార్ధన్ చెప్పిందాంట్లో మీరెక్కడ తికమక పడ్డారో నాకు అర్ధమే కావడం లేదు.

క్రీస్తుకి క్రైస్తవానికి ఎంతో తేడా ఉంది. క్రీస్తు ఖచ్చితంగా ఒక సత్యాన్వేషకుడు. ఒక యోగి. సున్నిత హృదయుడు, సంస్కర్త, సాధులక్షణములు కలవాడు. ఇది ఈ ప్రపంచం అంగీకరించే స్థూల విషయం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు.

క్రీస్తు భారత దేశం వచ్చి వెళ్ళడానికి, క్రైస్తవం రావడానికి ముడి పెట్టక్కర్లేదు. క్రీస్తు ఒక్కడే కాదు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అలాగే క్రీస్తు కంటే ఎంతో మంది గొప్ప గొప్ప యోగులు వచ్చి వెళ్ళారు. ఇక్కడనే కాదు వాల్లు ఎన్నో ప్రదేశాలకు వెళ్ళారు కూడా. వాళ్ళు యొగులు. ఈశ్వరుని ఉనికిని కనుక్కోవడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళు విశ్వసాంతి కాముకులు. యే ఒక్కరి సొంతము కాదు. ఎవ్వరి వ్యతిరేకి కాదు. క్రైస్తవం ఆయన ఉన్నప్పుడిది కాదు. తదనంతరం వచ్చినది. ఒక వ్యక్తి మూలవిరాట్టుగా నిలబెట్టి తయారుకాబడిన ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే క్రైస్తవ మతం. అన్ని మతాల్లాగే ఈ మతం కూడా ప్రపంచమంతా వ్యాప్తి చేసారు.

యోగులందరికి కామన్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ వాళ్ళందరికి చాలా చోట్ల వ్యత్యాసం ఉంటుంది. అందరిని ఒకే గాటిన కట్టిపడేసి ఒక శ్రేణిలో చూడకూడదు.

aravind Joshua said...

క్రిస్నాగారు కృతజ్ఞతలు. జనార్ధన్ గారు పెట్టిన title చూడండి ఒకసారి. అలాగే క్రీస్తుకి, క్రైస్తవ్యానికి మీరు గమనించిన తేడా ఏంటో చెప్పండి.
క్రీస్తుని సత్యాన్వేషి అన్నారు మీరు. "నేనే మార్గం సత్యం జీవం" అన్నారాయన. క్రీస్తుని సున్నిత హ్రుదయుడు, సాధు లక్షణాలు కలిగిన వాడు అన్నారు. ఆయనలోని ఆ సున్నిత కోణం పాప భారంతో క్రుంగి, పాపంలోనిండి బయటికి రాలేక, ఆ శాపాన్ని అనుభవిస్తున్న వారికే పరిమితం. వేషధారులమీద, self righteous people మీద ఆయన చూపించిన కోపాన్ని మీరు గమనించలేదు బహుశా.

క్రీస్తు భారతదేశం రావడానికి, క్రైస్తవ్యం రావడానికి లింకు నేను పెట్టలేదు. క్రీస్తు భారతదేశం వచ్చాడని నేను అనలేదు. అందుకు ఏమీ ఆధారాలుకూడా లేవు. క్రైస్తవ్యం భారతదేశంలోకి రావడానికి అమెరికన్లు, బ్రిటీషువాళ్ళు కారణం అనుకునే వాళ్ళ అజ్ఞానం గురించి అలా అన్నాను. బ్రిటీషు వాళ్ళు రావడానికన్నా చాలా ఏళ్ళ క్రితమే 52AD లోనే భారతదేశానికి సైంట్ థామస్ ద్వారా వచ్చింది.

అలాగే భారతదేశం వచ్చిన, క్రీస్తుకంటే గొప్పవారైన ఆ యోగులెవరో చెబితే బావుంటుంది.

aravind Joshua said...
This comment has been removed by the author.
విశ్వమిత్ర said...

క్రీస్తు కోసం మిగతా గురువు లను విమర్శించే అర్హత మీకు రాలేదు (ఎందుకంటే ఆ అర్హత కల వారు విమర్శించరు). క్రైస్తవం ఎప్పుడు పుట్టింది. ఈ రెండు వేల సంవత్సరాలలో చర్చి ఎంత మందిని పొట్టన పెట్టుకుందో మీకు తెలుసా ? ఏ ఒక్కరిని గుడ్డిగా నమ్మి గొఱ్ఱెలా పోవడం శ్రేయస్కరం కాదు. ఓషో క్రీస్తు గురించి విమర్శించాడని మీకు అనిపించవచ్చు.. ఉడుకుతనం తోటి ఇలా వ్రాసి ఉండవచ్చు.. ఇద్దరు ఒకే శరీరం కల వారు ఒకరి పై ఒకరు వేసుకునే జోకులు మాత్రమే అవి.. ఓషో క్రీస్తు చెప్పినదాన్ని ప్రపంచం అర్థం చేసుకోలేదంటాడు.. రాను రానూ వక్రీకరించబడింది అంటారు.

బ్లాగు ఉంది కదా అని గుడ్డిగా విమర్శించడం దేనిని సూచిస్తుంది. ఒక వర్గం వ్యక్తి ఇంకో వర్గాన్ని ద్వేషించటాన్ని సూచిస్తుంది. మీ వ్రాతల్లో ఏమాత్రం హేళన లేకపోయినా నేను కామెంటు పెట్టేవాన్ని కాదు. ఎప్పుడో పుట్టి చని పోయిన మనుషుల పై గుడ్డిగా అవాకులు చవాకులు ఎలా పేలుతావు ?

Anonymous said...

Osho is great master.