అసలైన బైబిల్ మిర్దాద్ పుస్తకమా? మిర్దాద్, బైబిల్ ఒకటేనా? స్వార్ధంకోసం దేవుడ్నే మోసం చేసారా? అని ఈమధ్య ఒకాయన ఒక పోస్ట్ రాసారు. http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_16.html
అసలేం చెప్పలనుకుంటున్నారో అర్ధం కానప్పటికీ తెలుగు బ్లాగు ప్రపంచంలో క్రైస్తవ్యం మీద ఉన్న అవగహనా రాహిత్యం, అసహననికి ఇది ఒక నిదర్శనం. ఆయానకి నాకున్న కొంచెం జ్ఝ్నానంతో ఇచ్చిన సమాధానం ఇక్కడ...
క్రీస్తు గురించి, క్రైస్తవ్యం గురించి మీకున్న ఆసక్తి అభినందనీయం. మీరు ప్రస్త్తవించిన మిర్దాద్ పుస్తకం గురించి నేనీమీ చెప్పలేనుగానీ మీరు క్రైస్తవం గురించి మొదటి పేరాలో చేసిన ఆ వ్యాఖ్యలకి సోర్స్ ఏంటో తెలుసుకోవొచ్చా? క్రీస్తు బౌధ్ధం ప్రచారం చేసాడా? దఃఖానికి కోరికలు కారణం అని క్రైస్తవ్యం చెబుతుందా? జీవితాన్ని కోరుకున్న రీతిలో బతకండి అని చెబుతుందా? ఇది మీ సొంత కవిత్వమా లేక శ్రుత పాండిత్యమా? మీరెప్పుడైనా బైబిల్ చదివారా కనీసం?లేక సంచలనం కోసం ఇలా కథనాలు వండి వారుస్తుంటారా?
ఓషొ గురించి ఆయన క్రీస్తు గురించి అన్న మాటలగురించి నేనూ కొంచం విన్నాను. నాకు ఓషో మాటలకన్న ఆయన ఫొటోలు బాగా నచ్చుతాయి. మంచి కాస్ట్యూం డిజైనర్, మంచి ఫొటోగ్రాఫెర్ మరొక మంచి పోస్ స్టైలిస్ట్ కలిసి ఒక భగవంతుడిలా ఆయన్ని బాగనే పెయింట్ చేసారు.
ఒక యోగి ఆత్మ కథ చదివారా? దాంట్లో జీసస్ ని ఒక క్రియా యోగిగా, ఒక enlightened master గా ప్రస్తావించారు. ఈ ఓషో కూడా ఒక పుస్తకంలో జీసస్ సిలువ మీద మరణించలేదని, ఒక యోగా technique ఉపయోగించి బయటపడి తిరిగి మన కాష్మీర్ వచ్చి, పెళ్ళి చెసుకుని ఇక్కడే చనిపొయాడని, ఆయన సమాధి అక్కడే పెహల్గావ్ అనే ఊర్లో ఉందనీ రాసారు. పెహల్గావ్ అన్న పేరు ఆ ఊరికి రావడానికి కారణం కూదా జీసస్సేనట. ఎందుకూ అంటే ఆయన ఒక గొర్రెల కాపరి కదా? హ హా! అదండీ జీసస్ గురించి ఓషో గారికి ఉన్న అవగాహన. "నేను నిజమైన గొర్రెల కాపరిని, నిజమైన గొర్రెల కాపరి తన మంద కోసం తన ప్రాణం పెడతాడు" అని జీసస్ తన మరణం గురించి ప్రవచనాత్మకంగా చెప్పిన మాటల్ని inspiration గా తీసుకుని కొంతమంది ఆయన గొర్రెల కాపరిగా paintings వేస్తే...ఆయనేదో నిజంగా గొర్రెలని మేపుకొనేవాడని మన ఓషో decide అయిపొయాడు. ఇక ఏం మాటాడమంటారు మన "భగవాన్" గురించి? ఇలా జీసస్ గురించి పరస్పర విరుధ్ధమైన రెండు కథనాలు రాయడంలో ఓషోకున్న confusion ఏంటో? (see http://www.messagefrommasters.com/Hidden-Mysteries/Jesus-lived-in-india.htm)
also, read pages 166,203,258,302,362,363,400,471 etc in "auto biography of a Yogi".
క్రీస్తుని విమర్శించే వాళ్ళు ముందు మీ stand ఏంటో గా తేల్చుకోండి. ఓ పక్కనుంచి జీసస్ కి ఒచ్చిన జ్ఞానమంతా మనమిచ్చెందే అనీ ఆయన బాల్యంలో భారతదేశం వచ్చి యోగ, ధ్యానం నేర్చుకెళ్ళాడనీ అంటారు. కానీ క్రైస్తవ్యం మాత్రం పాశ్చాత్య దేశాలనుంచీ ఒచ్చిందంటారు. కొంతమంది ఆయన ఒక క్రియా యోగి అనీ, జ్ఞానం పొందీన బుధ్ధుడు అనీ అంటారు. గౌతమ బుధ్ధ, క్రిష్ణుల స్థాయిలోని గురువు అంటారు. అంతలోనే ఆయన్ని అనుసరించేవారు మాత్రం డబ్బుకు, ప్రలోభాలకి అమ్ముడు పోయారు అంటారు.
బైబిల్లో ఒకసారి(మత్తయి 22:42)ఆయనే అక్కడున్న (యూదా)మతవాదులని అడిగినట్టుగా మిమ్మల్నీ అడగాలనుకుంటున్నా..
క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది?
యూదులు అనుకున్నట్టుగా ఆయన తనని తాను దేవుని కుమారుడిగా పిల్చుకునే ఒక దురహంకారా? ఇస్లాంలో రాయబడినట్టుగా పరిశుధ్ధత్మ కలిగిన ఒక దేవదూతా? క్రైస్తవులు నమ్ముతున్నట్టుగా మనుషుని రూపంలో పుట్టిన సర్వ స్రుష్టికర్త అయిన దేవుడా? పరమ హంస యోగానంద లాంటి వారు నమ్మినట్టుగా, బుధ్ధుడు, క్రుష్ణుడు వంటి వారి శ్రేణిలో ఒకడైన enlightened masterఆ? లేక మన ఓషో గారు తన స్థాయికి తగ్గట్టుగా సెలవిచ్చిన ...
అప్పుడు రాయండి ఏమన్న ఉపయోగపడేవి. మేమూ పాలుపంచుకుంటాం! అంతేగానీ ఇలా మీరు confuse అయ్యి మమ్మల్నిconfuse చేయకండి.